Eenadu Vasundhara Contest

Eenadu Vasundhara Contest

తనువంతా నీలం.. కొప్పున నెమలి పింఛం.. ఓ చేతిలో వెన్నముద్ద.. మరో చేతిలో పిల్లనగ్రోవి.. మైమరపించే వేణుగానం.. ఇలా చిన్నికృష్ణుడి అందం, ఆహార్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ‘కృష్ణాష్టమి’ రోజున మన చిన్నారుల్నే ముద్దుల కన్నయ్యలుగా ముస్తాబు చేసి మురిసిపోతుంటాం. అంతేనా.. ఆ గెటప్‌ను ఫొటోలు, వీడియోల్లో బంధించి పది కాలాల పాటు పదిలపరచుకుంటాం..!

మరి, కృష్ణాష్టమి సందర్భంగా మీరూ మీ ముద్దులొలికే చిన్నారుల్ని అందాల చిన్నికృష్ణుడిలా ముస్తాబు చేశారా? అయితే మీ చిన్ని కిట్టయ్య ఫొటోలను మాకు పంపించండి. వాటిని ‘వసుంధర.నెట్’లో ప్రచురిస్తాం.

Upload Photo

(Aadhar card / Passport/ Birth Certificate)
(Aadhar card / Passport/ Driving License/ Voter ID)
(Aadhar card / Passport/ Driving License/ Voter ID)
Note : Photo size should not exceed 500 kb
పాఠకులకు గమనిక:

1. ఈ శీర్షిక నిమిత్తం 6 ఏళ్లలోపు చిన్నారుల ఫొటోలను మాత్రమే పంపించాలి. తమ పిల్లల ఫొటో పంపే వారు ఫొటోతో పాటు తమ ఐడీ ప్రూఫ్ కూడా తప్పనిసరిగా జతచేయాలి. పేరు, వయసు, చిరునామా.. మొదలైన వివరాలన్నీ తప్పకుండా తెలియజేయాలి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అటువంటి ఎంట్రీలు పరిగణించబడవు. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ అవకాశం లేదు.

2. స్పష్టత లేని ఫొటోలు పరిగణించబడవు.

3. మాకు వచ్చిన వాటిలో ప్రచురించడానికి అనుగుణంగా ఉన్న ఫొటోలను మా వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తాం. ఇదే శీర్షికలో మీ ఫొటోలను చూసుకోవచ్చు.

4. ఫొటో పంపే వారు ముందుగా నియమ నిబంధనలు/ డిస్‌క్లెయిమర్ క్షుణ్ణంగా చదవగలరు.

ఈ శీర్షిక నిమిత్తం 6 ఏళ్ల లోపు చిన్నారుల ఫొటోలను మాత్రమే పంపించాలి. ఈ శీర్షికలో ప్రచురించే వివరాలు, ఫొటోలకు సంబంధించి పూర్తి బాధ్యత ఈ శీర్షికలో పాల్గొనే వారిదే. కాబట్టి సరైన వివరాలతో ఫొటోను అప్‌లోడ్ చేయగలరు. మీ వివరాలు, ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారంటే వాటిని 'ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్లో ప్రచురించడానికి మీ పూర్తి అంగీకారం మాకు తెలియజేసినట్లే. వీటికి సంబంధించి ఎలాంటి వివాదాలు తలెత్తినా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (ఈనాడు) ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు.

నిబంధనలు, ప్రమాణాలకు లోబడి పంపిన ఫొటోలు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా నియమ నిబంధనలను సవరించడానికి, రద్దు చేయడానికి వెబ్‌సైట్ నిర్వాహకులకు (ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌- ఈనాడు) పూర్తి హక్కులున్నాయి.

మీరు పంపే ఫొటోల పరిమాణం 500 KB లోపు ఉండాలి. జేపీజీ/ పిఎన్‌జీ/ జిఫ్ ఫార్మాట్‌లో పంపించాలి.

ఫొటోల ప్రచురణకు సంబంధించిన తుది నిర్ణయం సంపాదక వర్గానిదే. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ అవకాశం ఉండదు.

అత్యవసర సమయం/ సందర్భాల్లో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే శీర్షికని వాయిదా వేసే, రద్దు చేసే హక్కు నిర్వాహకులకు ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు, వాదోపవాదాలకు తావుండదు.

ధ్రువీకరణ

పైన తెలిపిన నియమ నిబంధనలను మేము పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాం. వాటన్నిటికీ కట్టుబడి ఉండటానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం.

ఈ ఫొటో మా సొంతం. ఈ ఫొటో పైన సర్వహక్కులూ మావే. మా సంపూర్ణ అంగీకారంతో మాత్రమే ఈ ఫొటో అప్‌లోడ్ చేస్తున్నాం. మేము అప్‌లోడ్ చేసే ఫొటోలు, వివరాలను ప్రచురించడానికి 'ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్ నిర్వాహకులకు (ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌- ఈనాడు) మా బుద్ధిపూర్వక ఆమోదాన్ని తెలియజేస్తున్నాం.

పైన తెలిపిన నియమ నిబంధనల్లో ఏ అంశాన్నీ వివాదాస్పదం చేయమని హామీ ఇస్తూ వాగ్దానం చేస్తున్నాం. ఈ శీర్షికకు సంబంధించి మేము ఇచ్చిన వివరాలన్నీ పూర్తిగా వాస్తవాలేనని, వేటినీ వక్రీకరించలేదని ఇందుమూలంగా ధ్రువీకరిస్తున్నాం.

మా ఫొటోలను ఈ శీర్షిక నిమిత్తం ‘ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తున్నామంటే వాటి పైన పూర్తి హక్కులు ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (ఈనాడు)కి ఉంటాయన్న విషయం మాకర్థమైంది.

డిస్‌క్లెయిమర్

ఈ శీర్షికలోని ఫొటోలకు సంబంధించి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా ఇక్కడ క్లిక్ చేసి మాకు తెలియజేయండి. అటువంటి ఫొటోలను కేవలం వెబ్‌సైట్‌లోంచి తొలగించడం మాత్రమే ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (ఈనాడు) బాధ్యత. అంతకుమించి ఇతరత్రా చట్టపరమైన చర్యలకు ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (ఈనాడు) బాధ్యత వహించదు.